బిగ్ బాస్ ఎమోషనల్ ఎపిసోడ్స్ లో గెలుపెవరిది?

Published on Oct 17, 2019 11:17 am IST

గత కొన్ని ఎపిసోడ్స్ నుండి బిగ్ బాస్ లో ఎమోషనల్ సన్నివేశాలకు తెరలేపారు. రోజుల తరబడి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా బంధాలకు, బయట ప్రపంచానికి దూరంగా ఉంటున్న వారి కుటుంబ సభ్యులను ఇంటిలోకి అనుమతించి ఒకింత సాంత్వన కలిగేలా చేశారు. చాలా రోజుల తరువాత కుటుంబ సభ్యులను చూసిన ఇంటి సభ్యులు ఉద్వేగానికి లోనవుతున్నారు. శివ జ్యోతి భర్త, వితిక చెల్లెలు,అలీ రెజా భార్య, బాబా భాస్కర్ పిల్లలు రావడం జరిగింది. వారి వారి కుటుంబ సభ్యులను చూసిన కంటెస్టెంట్స్ ఫీలింగ్స్, ఎమోషన్స్, బిహేవియర్ అనేది ప్రముఖంగా నిలుస్తుంది.

బిగ్ బాస్ మాటేమో గాని,ప్రేక్షకులు వీరిని సునిశితంగా గమనిస్తున్నారు. ఆడియన్స్ అటెన్షన్ కోసం ఆర్టిఫిషల్ గా ప్రవర్తిస్తే ప్రేక్షకులకు నచ్చడం లేదు. సహజంగా ఉండే ప్రవర్తనా తీరుకి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని సమాచారం. కాగా శివ జ్యోతి, వితిక, అలీ రెజాలతో పోల్చితే బాబా ఈ ఎమోషనల్ ఎపిసోడ్స్ లో ఎక్కువ మార్క్స్ కొట్టేశారని తెలుస్తుంది. కొడుకు కూతురితో ఆయన గడిపిన హ్యాపీ మూవ్మెంట్స్ అందరికి నచ్చాయని తెలుస్తుంది. కాగా ఈ వారం హౌస్ లో ఉన్న ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More