‘ఆర్ఆర్ఆర్’ నుండి ఇంట్రస్టింగ్ పోస్ట్ !

Published on Aug 4, 2019 12:01 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇద్దరి హీరోల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది ‘ఆర్ఆర్ఆర్’ బృందం. పోస్టర్‌ ను ట్వీట్ చేస్తూ.. ‘రామరాజు, భీంల స్నేహంలాగానే, గొప్ప స్నేహం ఎప్పుడూ అనుకోకుండానే మొదలవుతుంది. మీరు కూడా మీ జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడిని కలిసి ఉంటారు. అలా కలిసిన వ్యక్తుల్లో మీ జీవితంలో మీకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడు ఎవరు ? ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అతనితో దిగిన ఫొటోను మాతో పంచుకోండి’’ అని ‘ఆర్ఆర్ఆర్’ బృందం పోస్ట్ పెట్టింది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేస్తున్నాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :