బాహుబలి తరువాత రాజమౌళి చేయాలనుకున్నది ఆర్ ఆర్ ఆర్ కాదా?

Published on Oct 10, 2019 10:50 pm IST

దర్శకుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో ఏ స్థాయికి ఎదిగాడో చెప్పాల్సిన అవసరం లేదు. భారత చలన చిత్ర చరిత్రలోనే ఎవరు సాధించని, సమీప భవిష్యత్తులో సాధించలేని కలెక్షన్స్ ని బాహుబలి చిత్రాలతో ఆయన కొల్లగొట్టారు. తెలుగు సినిమా పరిశ్రమ గర్వంగా జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబడేలా ఆయన చేశారు. ఆ మూవీ తరువాత ఆయన మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్, చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ అనే మల్టీస్టారర్ మూవీని గత ఏడాది ప్రారంభించి చిత్రీకరణ జరుపుతున్నారు.

ఐతే బాహుబలి తరువాత రాజమౌళి చరణ్,ఎన్టీఆర్ లతో కాకుండా మహేష్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.బాహుబలి చిత్రీకరణ సమయంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కె ఎల్ నారాయణ నిర్మాతగా మహేష్ తో మూవీ చేస్తున్నాను అని స్వయంగా రాజమౌళి చెప్పారు. దీని ప్రకారం బాహుబలి తరువాత రాజమౌళి, మహేష్ తో మూవీ చేయాలి. కానీ అలా జరగలేదు. బాహుబలి 2 విడుదలైన దాదాపు ఒక ఏడాది తరువాత ఆయన ఆర్ ఆర్ ఆర్ మూవీని ప్రకటించారు.

కాబట్టి కె ఎల్ సత్యనారాయణ నిర్మాతగా రాజమౌళి మహేష్ తో చేయాల్సిన మూవీ ఆగిపోయిందా, లేక ఆర్ ఆర్ ఆర్ తరువాత మహేష్ మూవీ ఉంటుందా అనేది తెలియాల్సివుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ 2020 జులై 30న విడుదల కానుంది. ఎటూ రాజమౌళి మూవీ విడుదల అయిన తరువాత తదుపరి చిత్రంకోసం ఏడాదికి పైగా సమయం తీసుకుంటారు. ఒకవేళ మహేష్ తో ఆయన మూవీ ఉన్నా చాలా సమయం తీసుకునే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More