అధిరా టాకీస్ ‘వైఫ్’ టైటిల్, ఫస్ట్ లుక్ ఆవిష్కరణ – త్వరలో రెండవ షెడ్యూల్

అధిరా టాకీస్ ‘వైఫ్’ టైటిల్, ఫస్ట్ లుక్ ఆవిష్కరణ – త్వరలో రెండవ షెడ్యూల్

Published on Dec 14, 2025 6:00 PM IST

Wife

అధిరా టాకీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందుతున్న ‘వైఫ్’ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుల చేతుల మీదుగా లాంచ్ చేశారు. శ్రీనివాస్ (బుజ్జి) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నరేన్ తేజ్, సుహానా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతోందని దర్శకుడు బుజ్జి తెలిపారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకులు చంద్ర మహేష్, సముద్ర, నిర్మాత రామ సత్యనారాయణ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘భర్తకు, కుటుంబానికి పునాదిలా ఉండే వైఫ్ అనే టైటిల్ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుంది’ అని చంద్ర మహేష్ అన్నారు. ఈ సినిమాకు సినిటారియ మీడియా వర్క్స్ సపోర్ట్ బలంగా నిలిచిందని నిర్మాత రామ సత్యనారాయణ పేర్కొన్నారు. అలాగే, కే మ్యూజిక్ వారు పాటలను కొనడం విశేషమన్నారు.

​దర్శకుడు బుజ్జి మాట్లాడుతూ.. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిందని, త్వరలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిపారు. హీరోయిన్ సుహానా మాట్లాడుతూ, తన పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుందని, ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఐటీ రంగాన్ని వదిలి వచ్చిన హీరో నరేన్ తేజ్, ఒక మంచి కథతో వస్తున్నామని, ప్రేక్షకుల మద్దతు కోరుకుంటున్నామని తెలిపారు. ఈ చిత్రానికి మురళీకృష్ణ వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సత్య కాశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు