ఆర్జీవీ సలహా మేరకే అఖిల్ సినిమా చేస్తారా ?

1st, February 2018 - 08:47:10 AM

ఇటీవలే ‘హలో’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన అక్కినేని హీరో అఖిల్ యొక్క మూడవ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటుడిగా 2వ చిత్రంతో మంచి మార్కులు సంపాదించుకున్న ఈ హీరో మాత్రం ఇంకా నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. సినీ సర్కిల్స్ లో అఖిల్ ఈసారి పెద్ద దర్శకుడితో పనిచేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే అఖిల్ ఈసారి ఆర్జీవీ సలహా మేరకు కొత్త దర్శకుడితో పనిచేస్తారని కూడా కొందరంటున్నారు. నాగార్జునతో ఒక ఇంటెన్స్ పోలీస్ డ్రామాను తెరకెక్కిస్తున్న ఆర్జీవీ కొత్తవాళ్లతో చేస్తే బాగుంటుందని చెప్పి, ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ ను నాగార్జున, అఖిల్ కు పరిచయం చేశారట. మరి అఖిల్ ఆర్జీవీ సలహాను పాటిస్తారో లేకపోతే సొంత నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నిర్ణయం ఏదైనా ఆయన త్వరగా సినిమాను ప్రకటిస్తే అభిమానులకు కొంత సంతృప్తిగా ఉంటుంది.