జేమ్స్ బాండ్ చిత్రంతో అల్లరి నరేష్ తిరిగి విజయాన్ని సాధిస్తాడా?

జేమ్స్ బాండ్ చిత్రంతో అల్లరి నరేష్ తిరిగి విజయాన్ని సాధిస్తాడా?

Published on May 9, 2015 11:46 AM IST

James-Bond
వరుసపెట్టి సినిమాలు వస్తున్నా వాటి ఫలితంలో లెక్కలేకుండా అల్లరి నరేష్ తదుపరి సినిమాపై అంచనాలు ఏర్పడడం సహజం. మరోసారి జేమ్స్ బాండ్ చిత్రం ద్వారా మనల్ని పలకరించనున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విజయంపై చిత్రబృందం చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రచారం పై చాలా పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తుంది.

నరేష్ గత చిత్రాలు పరాజయం పాలవడంతో ఈ సినిమా అతని కెరీర్ కి ఇంపార్టెంట్ గా మారింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. జేమ్స్ బాండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు
దర్శకుడు సాయి కిషోర్. అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందాల భామ సాక్షి చౌదరి హీరోయిన్.

తాజా వార్తలు