‘ఐ’ సినిమాతో అమీ జాక్సన్‌కు బ్రేక్ ఖాయమేనా..?

I-poster
సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఐ’ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది బ్రిటీష్ మోడల్ కం హీరోయిన్ అమీ జాక్సన్. హీరోయిన్‌గా తనకు ‘ఐ’ సినిమా పెద్ద బ్రేక్ తీసుకొస్తుందని ఆశిస్తుంది. తెలుగు ‘ఎవడు’, తమిళంలో ‘మదరాస పట్టణం’ సినిమాలతో విజయాలు అందుకున్నా, నటిగా అమీ జాక్సన్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆమె నటన పట్ల విమర్శకులు పెదవి విరిచారు. శంకర్ నటిగా తనలో ప్రతిభను వెలికి తీశారని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుంది. పిసి శ్రీరామ్ తనను అందంగా చూపారని మురిసిపోతుంది. యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అమీ జాక్సన్ అద్బుతంగా నటించిందని అంటున్నారు.

‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమాను భారి నిర్మాణ వ్యయంతో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, ఆడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. అడ్వాన్సు బుకింగ్ ఓపెన్ అవ్వడంతో థియేటర్ల వద్ద ‘ఐ’ సినిమా సందడి నెలకొంది.

Exit mobile version