కంగనా ‘తలైవి’ కోసం బాలయ్య ఒప్పుకుంటాడా ?

Published on Nov 12, 2019 8:21 am IST

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్న ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ఈ చిత్రం నిన్న మొదలైన సంగతి తెలిసిందే.

అయితే జయలలిత జీవితంలో ఎం.జి.ఆర్, కరుణానిధి ముఖ్యమైన భూమిక పోషించారు. ఇప్పటికే ఎం.జి.ఆర్ గా అరవింద స్వామిని మరియు కరుణానిథిగా ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసింది చిత్రబృందం. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించే అవకాశం ఉంది. ఎందుకంటే, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో విష్ణు ఇందూరి కూడా ఒకరు. ఇప్పుడు ఆయన నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఉండటం, ఆ పాత్రలో బాలయ్య అయితేనే ఆ పాత్రకు నిండుతనం వస్తోంది. ఈ మేరకు విష్ణు ఇందూరి కోరితే బాలయ్య కాదనపోవచ్చు.

అలాగే జయలలిత జీవితంలో మరో కీలకమైన పాత్ర అలనాటి అందాల హీరో శోభన్ బాబుది. మరి శోభన్ బాబు పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుంది.

సంబంధిత సమాచారం :

More