హిందీలో యాక్షన్ హీరోగా వర్కౌట్ అవుతుందా ?

Published on Aug 1, 2021 11:07 pm IST

ప్రభాస్ కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమా ‘ఛత్రపతి’ని హిందీలోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి బాలీవుడ్ లో ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి . అయితే, ఈ ఛత్రపతి ఒరిజినల్ కథను అందించిన విజయేంద్రప్రసాదే ఈ రీమేక్ కి కూడా కథను అందిస్తూ.. హిందీ వెర్షన్‌ లో చాలా మార్పులు చేశారు.

ముఖ్యంగా సినిమాలో యాక్షన్ సీన్స్ ను చాలా మార్చారట. అలాగే మదర్ ఎమోషన్ తో సాగే సన్నివేశాలను కూడా చాల వరకు మార్చరట. ఈ జనరేషన్ కి తగ్గట్టు ఆ సీన్స్ ను అప్ డేట్ చేశారట. మొత్తానికి ఈ సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉందని తెలుస్తోంది. మొత్తమ్మీద పక్కా మదర్ సెంటిమెంట్ తో నడిచే కథతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ ఈ ప్రాజెక్టు పట్ల చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

కాకపోతే హిందీలో యాక్షన్ హీరోగా మాస్ ఇమేజ్ లేని బెల్లంకొండకి యాక్షన్ సీక్వెన్స్ ఏ స్థాయిలో వర్కౌట్ అవుతాయో.. ? హిందీ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :