అదే నిజమైతే బుల్లితెరపై నవ్వుల జల్లులే..!

Published on Jul 3, 2020 1:29 pm IST

ఆధునిక సినిమా యుగంలో బ్రహ్మానందం ఒక హాస్యపు అధ్యాయం అనుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా కామెడీలో ఎదురు లేని రారాజుగా ఆయన కొనసాగుతున్నాడు. హీరో ఎవరైనా బ్రహ్మానందం కోసం సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండాల్సిందే. అసలు బ్రహ్మానందం హాస్యం కారణంగా ఆడిన సినిమాలు అనేకం. ఆయన కొన్నాళ్లుగా వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. గత ఏడాది ఆయన కొంచెం అనారోగ్యం పాలయ్యారు. అందుకే ఆయన ఎక్కువుగా సినిమాలు ఒప్పుకోవడం లేదని సమాచారం.

తాజాగా ఆయనపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బ్రహ్మానందం ఓ సీరియల్ కోసం సైన్ చేశారట. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఆ సీరియల్ షూటింగ్ మొదలుకానుందట. ఇది ఓ కామెడీ సీరియల్ అని ప్రచారం జరుగుతుంది. మరి ఇదే కనుక నిజమైతే బుల్లితెర ప్రేక్షకులకు సందడే అని చెప్పాలి, ఇంటిల్లపాదిని బ్రహ్మనందం నవ్వుల జల్లులో తడిపేయడం ఖాయం.

సంబంధిత సమాచారం :

More