
మెగా పవర్ స్టార్ చరణ్ కెరీర్లో ఇప్పటి వరకూ చేసింది 8 సినిమాలు, ఇందులో చరణ్ కి విజయాలే ఎక్కువ అపజయాలు చాలా తక్కువ. మగధీర సినిమా తర్వాత చరణ్ కెరీర్లో చాలా హిట్స్ ఉన్నాయి, అన్నీ 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేసాయి కానీ ఒక్క సినిమా కూడా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేయలేకపోయింది. కానీ ఈ వారం అనగా అక్టోబర్ 16న రిలీజ్ కానున్న ‘బ్రూస్ లీ’ సినిమాతో మాత్రం చరణ్ కి ఓవర్సీస్ లో 1మిలియన్ మార్క్ సినిమా కచ్చితంగా పడుతుందని ఈ చిత్ర టీం గట్టిగా చెబుతోంది.
ఇదే విషయాన్ని ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల ముందు ఉంచితే.. వారు కూడా కచ్చితంగా ఈ సారి చరణ్ 1 మిలియన్ మార్క్ క్రాస్ చేస్తాడని అంటున్నారు. మునుపెన్నడూ లేని రేంజ్ లో, ఓవర్సీస్ లో దాదాపు 300ల కన్నా ఎక్కువ సెంటర్స్ లో బ్రూస్ లీ రిలీజ్ అవుతోంది. అలాగే ప్రీమియర్స్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేసారు. అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం సుమారు $700K కేవలం ప్రీమియర్స్ తోనే వస్తుందని అంటున్నారు. దీని ప్రకారం 1 మిలియన్ మార్క్ కొట్టడం పెద్ద విషయమేమీ కాదు. చరణ్ తో పాటు శ్రీను వైట్ల సినిమాలకు కూడా కాస్త క్రేజ్ ఉండడం ఈ సినిమాకి మరింత హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. మరి అందరి అంచనాలను నిజం చేస్తూ చరణ్ బ్రూస్ లీ తో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరో 4 రోజులు వేచి చూడాల్సిందే.

