మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 150 సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాపై ఆగష్టులో అధికారిక ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఏమీ బయటకి తెలియకపోయినా ఇండస్ట్రీలో మాత్రం చిరు ఏ సినిమా చేస్తారు? అతని టెక్నికల్ టీం ఎవరు అనేదానిపై ఏదో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి.
చాలా సంవత్సరాల క్రితం పరుచూరి బ్రదర్స్ చెప్పిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథని చిరంజీవి ఒకే చేసారు. ఈ కథలో విప్లవాత్మక థీమ్ తో పాటు పవర్ఫుల్ పాత్రకి కూడా ఆస్కారం ఉంది. ప్రస్తుతం చిరంజీవికి ఈ సినిమా వర్క్ అవుట్ అవుతుందా? ఇదే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలోనూ ఉంది. చిరు కూడా ఈ స్క్రిప్ట్ ని పరిశీలిస్తున్నారని సమాచారం.
సినిమా ఏది అనేది పక్కనపెడితే గీత ఆర్ట్స్ లేదా రామ్ చరణ్ చిరంజీవి 150వ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ మూవీపై మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.


