క్రేజీ సీక్వెల్ కి మళ్ళీ సోలో డేట్ దొరుకుతుందా ?

Published on May 2, 2021 9:00 pm IST

భారీ సినిమాలు కరెక్ట్ టైంలో రిలీజ్ అయితేనే బ్రేక్ ఈవెన్ అవుతాయి. అందుకే భారీ సినిమాలన్నీ ఈ సమ్మర్ ను టార్గెట్ చేసుకున్నాయి. కానీ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు అన్ని పోస్ట్ ఫోన్ అయ్యాయి. దాంతో భారీ సినిమా ‘కేజిఎఫ్ 2’ అయోమయంలో పడిపోయింది. నిజానికి ఎప్పుడో ఈ సినిమా ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నా, కేవలం అందర్నీ మ్యానేజ్ చేసుకుని సోలో రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుంది.

అయితే ఇప్పుడు సమ్మర్ మిస్ అవుతుంది కాబట్టి, ‘కేజిఎఫ్ 2’కి ఇప్పుడు సమ్మర్ లాంటి మరో సీజన్ కనిపించడం లేదు. దసరాకి తెలుగు భారీ సినిమాలే క్యూలో ఉన్నాయి. కాబట్టి, సోలో రిలీజ్ డేట్ అసాధ్యం. మరి పోటీలో తెలుగు స్టార్ హీరోలతో పోటీ పడి రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ వస్తాయని గ్యారంటీ లేదు. మరి ఈ క్రేజీ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా 2018లో సంచలన విజయం సాధించిన కెజిఎఫ్ అత్యంత ప్రజాదరణ పొందింది. అందుకే కెజిఎఫ్ 2కి అంతకు మించిన ఆదరణ ప్రేక్షకులలో నెలకొంది.

సంబంధిత సమాచారం :