మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడే’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటివల తన ఫాన్స్ తో ఇంటరాక్ట్ అయిన చరణ్ తనకి ‘ఆరెంజ్’ లాంటి చిత్రం మళ్లీ చేయాలనుందని తెలిపాడు. అంతేకాకుండా తనకి ఆ చిత్రం ఎంతో ఇష్టమని కాకపోతే ఆ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడింది అన్నారు.
‘మగధీర’ తర్వాత ఎన్నో అంచనాల మధ్య ‘ఆరెంజ్’ విడుదల అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన జెనిలియా నటించింది.


