బన్నీ మూవీని హిందీలో రీమేక్ చేస్తారా?

Published on Jul 8, 2020 12:04 am IST


2017లో బన్నీ పూజ హెగ్డే జంటగా, దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన డి జే మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. రెండు భిన్న గెటప్స్ లో బన్నీ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాడు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కాగా హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఓ స్టార్ హీరోతో అక్కడ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్నది దిల్ రాజు ఆలోచన అని ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే.

డి జే హిందీ డబ్ద్ వర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది.ఏకంగా యూట్యూబ్ లో ఈ చిత్రానికి 250 మిలియన్ వ్యూస్ దక్కడం విశేషం. దిల్ రాజు ప్రస్తుతం నాని హీరోగా గత ఏడాది విడుదలై ప్రశంశలు అందుకున్న జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. జెర్సీ హిందీ రీమేక్ లో హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. లాక్ డౌన్ ముందు వరకు ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా సాగింది.

సంబంధిత సమాచారం :

More