ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ కన్విన్స్ చేయగలడా?

Published on Feb 18, 2020 9:05 am IST

కళ్యాణ్ రామ్ ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఎంత మంచివాడవురా మూవీతో దిగారు. దర్శకుడు సతీష్ వేగేశ్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా ఆశించిన ఫలితం అయితే అందలేదు. ఇక ఆయన గతంలో రావణ అనే టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఐతే ఆయన ప్రస్తుతం ఏ చిత్రానికి కమిట్ అయినట్లు లేదు. ఐతే ఆయన తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో ఓ మూవీ చేసే ఆలోచనలో పడ్డారట. అది కూడా తమ్ముడు ఎన్టీఆర్ తో చేయాలని భావిస్తున్నారట.

గతంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ చిత్రం చేయడం జరిగింది. ఆ చిత్రం కళ్యాణ్ రామ్ ని గత చిత్రాల నష్టాల నుండి బయటపడేసింది. కాగా మళ్ళీ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేసి నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట. మంచి కథ వినిపించి ఆయనను ఒప్పించాలని కథలను వెతికే పనిలో కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఓ ప్రక్క ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఉండగానే…ఆయనతో మూవీ చేయాలని టాప్ క్రేజీ డైరెక్టర్స్ వరుసలో ఉన్నారు. మరి వీరందరిని కాదని తమ్ముడు ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ కన్విన్స్ చేయగలడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More