మహర్షి అక్కడ భరత్ అనే నేను రికార్డు ను బ్రేక్ చేస్తుందా ?

Published on May 5, 2019 11:53 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈనెల 9న మహర్షి తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. టీజర్ , ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే మహేష్ 25వ సినిమా కావడంతో ఈ సినిమాకు ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రానికి హిట్ టాక్ వస్తే రికార్డులు తిరగరాయడం ఖాయం. ఇక తెలుగు రాష్ట్రాల్లో మహేష్ కు వున్నా ఫాలోయింగ్ తో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు వున్నాయి.

అయితే ఇప్పుడు చెన్నై లో మహేష్ కు తన రికార్డు తానే బ్రేక్ చేసే మంచి అవకాశం వచ్చింది. భరత్ అనే నేను తెలుగు వెర్షన్ ఫుల్ రన్ లో చెన్నై సిటీ లో 1.7 కోట్ల గ్రాస్ ను రాబట్టి తెలుగు చిత్రాల్లో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మహేష్ కు మహర్షి ద్వారా ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం తమిళం లోకూడా మే 17వరకు పెద్ద సినిమాలు ఏవి విడుదలకాకపోవడం కూడా ఈ సినిమా కు కలిసిరానుంది.

సంబంధిత సమాచారం :

More