మహేష్ మళ్లీ ఆ పాత్రలో నటిస్తాడా ?

Published on Jan 23, 2020 1:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తరువాత సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని మహేష్ రోల్ కి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహేష్ ఈ సినిమాలో స్పై పాత్రలో నటించబోతున్నారట. అయితే మహేష్ బాబు ఇప్పటికే ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన స్పైడ‌ర్ సినిమాలో స్పై రోల్ లో న‌టించినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

అయినప్పటికీ మహేష్ బాబు మళ్లీ ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న సినిమాలో కూడా అలాంటి స్పై పాత్రలోనే నటించాలనుకోవడం నిజంగా విశేషమే. ఏప్రిల్ నెల‌లో ప్రారంభం కానున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇక వంశీ, మహేష్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

పైగా ‘మహర్షి’ ప్రతి ఒక్కరికీ మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చే సినిమా అని ప్రముఖుల చేత ప్రశంసలు కూడా పొందింది. మరి ఈ సారి చేయబోతున్న సినిమా ఏ రేంజ్ హిట్ సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More