నితిన్ ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా ?

Published on Jul 19, 2018 2:44 pm IST

‘ఆర్ఎక్స్100’ చిత్రం ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకునేలా చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే పెట్టిన బడ్జెట్ కి మూడింతల వసూళ్లు సాధించి పెట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతికి పెద్ద బ్యానర్ల నుండి అవకాశాలు వస్తున్నాయట. దాంట్లో భాగంగా యువ హీరో నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ఈ దర్శకుడిని అవకాశం ఇవ్వాలని భావిస్తోందట.

ఇక ఇటీవల నితిన్ కూడా ‘ఆర్ఎక్స్ 100’ చిత్రాన్ని వీక్షించి చిత్ర యూనిట్ ఫై ప్రశంసలు కురిపించారు. దాంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. మరి నితిన్ కోసం ఈ యంగ్ సెన్సషనల్ డైరెక్టర్ ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :