పింక్ కోసం పవన్ మేకప్ వేసుకోలేదు.

Published on Jan 21, 2020 2:06 pm IST

పవన్ రీఎంట్రీ నిన్న అధికారికంగా కన్ఫర్మ్ ఐపోయింది. నిన్న మంచి రోజు కావడంతో పింక్ రీమేక్ చిత్ర షూటింగ్ షురూ చేశారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. షూటింగ్ సెట్స్ లోని పవన్ ఫోటో ఒకటి లీక్ కావడం కూడా జరిగింది. జీన్స్, జాకెట్ ధరించి ఉన్న పవన్ సీరియస్ గా నడుచుకుంటూ వెళుతున్నట్టున్న ఆ ఫోటో ఆసక్తి కలిగించేదిగా ఉంది. ఐతే పవన్ పింక్ చిత్రం కోసం తన లుక్ మార్చలేదు. ఆయన బాగా పెరిగిన తన గడ్డాన్ని తీయలేదు, కనీసం ట్రిమ్ కూడా చేయలేదు. ప్రస్తుతం బయట ఎలా కనిపిస్తున్నారో అలానే ఆయన గెటప్ ఉంది. జస్ట్ కాస్ట్యూమ్స్ మాత్రం మారాయి అంతే.

కాబట్టి పింక్ చిత్రం కోసం పవన్ గెటప్ ఏమి మార్చడం లేదు. కథ రీత్యా ఇది గ్లామర్ రోల్ కాకపోవడంతో ఆయన కొంచెం కూడా లుక్ మార్చినట్టు లేదు. పవన్ ని సూపర్ గ్లామర్ హ్యాండ్ సమ్ గా చూడాలని ఫ్యాన్స్ అనుకుంటే వారికి నిరాశే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది .

సంబంధిత సమాచారం :

X
More