ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీకి రంగం సిద్ధం?

Published on Jul 4, 2020 1:58 pm IST

టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో జండా పాతిన ఏకైక హీరో ప్రభాస్. ఆయన నటించిన మూడు చిత్రాలు అక్కడ సక్సెస్ కొట్టాయి. బాహుబలితో ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సాహోతో మిక్స్డ్ టాక్ తో కూడా అక్కడ హిట్ అందుకున్నాడు. ఐతే బాలీవుడ్ లో ప్రభాస్ డైరెక్ట్ మూవీ చేస్తాడని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. కాగా దీనికి రంగం సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల అజయ్ దేవ్ గణ్ తో తన్హాజి అనే భారీ పీరియాడిక్ మూవీ తెరకెక్కించి హిట్ అందుకున్న దర్శకుడు ఓమ్ రౌత్ తో ప్రభాస్ మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వీరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీలో నటిస్తున్న ప్రభాస్ నెక్స్ట్ నాగ్ అశ్విన్ మూవీలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More