ఆ క్రేజీ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ లేటయ్యేలా ఉందే?

Published on Jul 11, 2020 10:33 am IST

ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకు వెళుతున్నాడు. టెంపర్ మూవీతో ట్రాక్ లో పడిన ఎన్టీఆర్ వరుసగా హిట్స్ అందుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ఆ, చిత్రం తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం ఖాయం అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తో ఆయన మూవీ కన్ఫర్మ్ కావడం ఫ్యాన్స్ కి కిక్కిచ్చింది. ఐతే ఈ మూవీ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ నుండి బయటికి రావడానికి ఎన్టీఆర్ కి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఆ చిత్రం తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ పూర్తి చేయాల్సివుంది. ఎంత త్వరగా పూర్తి చేసినా ఆ మూవీ విడుదల 2021 చివర్లో లేదా 2022 ప్రారంభంలో ఉంటుంది.

కెజిఎఫ్ మూవీ అక్టోబర్ 23న విడుదల కానుంది. ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెట్టాల్సింది ఉంది. దీనితో త్రివిక్రమ్ మూవీ పూర్తి అయ్యే వరకు ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనలేడు. కాబట్టి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ మొదలు కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది 2022లోనే అంటున్నారు. అంటే ఈ మూవీ విడుదల కావడానికి ఎటూ మరో ఏడాది సమయం పడుతుంది.

సంబంధిత సమాచారం :

More