యూఎస్‌లో ‘ప్రేమమ్’ 1 మిలియన్ కొడుతుందా?

12th, October 2016 - 07:44:20 PM

premam
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ గత శుక్రవారం భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మళయాలంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్‌కు రీమేక్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన క్రేజ్ కనిపించింది. ఇక ఆ క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా, అంచనాలను అందుకున్న సినిమా మొదటి రోజునుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. నాగ చైతన్య కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా ప్రేమమ్ నిలుస్తుందన్న ప్రచారం రావడంతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రేమమ్ మంచి వసూళ్ళు రాబడుతోంది.

ఇప్పటివరకూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 590కే డాలర్లు వసూలు చేసింది. వచ్చే వారం కూడా పెద్దగా సినిమాలేవీ లేకపోవడంతో ప్రేమమ్ ఇదే జోరు కొనసాగిస్తుందని ట్రేడ్ అంచనా. ఇదే జోరు కొనసాగితే మాత్రం ఈ వారాంతం పూర్తయ్యే సరికి 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడం పెద్ద విషయం కాదని చెప్పొచ్చు. మరి ఈ ఫీట్‌ను ప్రేమమ్ సాధిస్తుందా? లేదా? అన్నది చూడాలి. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు.