ఈ సమావేశంతో ‘లారెన్స్’ విషయం ఏమిటో తేలనుంది !

Published on May 26, 2019 11:47 am IST

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ జంటగా ఇటీవలే ముంబైలో ప్రారంభమైన ఈ చిత్రం నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. తనకు సరైన గౌరవం ఇవ్వలేదు అని, గౌరవం లేని చోట ఉండకూడదని లారెన్స్ సినిమా నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా దర్శకత్వం పై లారెన్స్ పోస్ట్ చేస్తూ.. నేను ‘లక్ష్మీబాంబ్’ సినిమా నుంచి తప్పుకొంటున్నట్లు గతంలో ప్రకటించాను. లక్ష్మీబాంబ్‌’ సినిమాకు దర్శకత్వం వహించాలని నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. నా డేట్లన్నీ ఈ సినిమా కోసమే కేటాయించాను. ప్రీ ప్రొడక్షన్‌ పనులపై ఎంతో దృష్టిపెట్టాను. ఈ రోజు నిర్మాతలు నన్ను కలవడానికి చెన్నై వస్తున్నారు. సినిమాకు ఎవరు దర్శకత్వం వహించాలన్నది వారే నిర్ణయిస్తారు. నా పనిని వారు గౌరవిస్తే అప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలా? వద్దా? అన్నది ఆలోచిస్తాను. సమావేశంలో ఏం జరుగుతుందో చూద్దాం. నా కోసం తాపత్రయపడుతున్న అభిమానుల కోసం నేను ఈ పోస్ట్‌ పెడుతున్నాను’ అని పోస్ట్ చేసారు.

సంబంధిత సమాచారం :

More