ఆగస్టు 15న ‘ఆర్ ఆర్’ ఆర్ ట్రీట్ ఉన్నట్లేనా?

Published on Aug 13, 2019 8:18 am IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ శరవేగంతో జరుగుతుంది. పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్, రామ్ చరణ్ లు ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇంకా రెండు రోజులలో భారత స్వాతంత్ర్య దినోత్సవం ఉన్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మూవీపై ఏదైనా ఆసక్తికర అప్డేట్ ఇస్తారా? లేదా? అని అటు సినీ అభిమానులతో పాటు, ఇటు తారక్, చరణ్ ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇద్దరు స్టార్ హీరోలలో ఎవరో ఒకరి లుక్, లేదా ఇద్దరి లుక్ విడుదల చేశే అవకాశం కలదని ఇండస్ట్రీలో అప్పుడే ఓ పుకారు మొదలైపోయింది. రానున్న పండుగ దేశానికి, దేశభక్తికి సంబంధించి కావడం తోపాటు, ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా దేశభక్తి కథా నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఖచ్చితంగా ఎదో ఒక అప్డేట్ రాజమౌళి ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కొమరం భీం లుక్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఐతే చిత్ర విడుదలకు ఇంకా అటుఇటుగా ఏడాది కాలం ఉన్న నేపథ్యంలో అప్పుడే రాజమౌళి వీరి పాత్రలు పరిచయం చేస్తారా? అనే అనుమానం కలుగుతుంది. మరి రాజమౌళి సడన్ సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారో లేదో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

డి వి వి దానయ్య నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్,అలియా భట్,సముద్ర ఖని, వంటి వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తుండగా,వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :