రవితేజ ఈ రిస్క్ తీసుకోనున్నారా.?

Published on Dec 4, 2020 9:01 am IST

అత్యవసరంగా ఒక మాస్ హిట్ ను అందుకోవాలని టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ చూస్తున్నారు. ఒక్క రవితేజ మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా రవితేజ హిట్టు కొడితే చూడాలి అనుకుంటారు. అలాంటి అభిమానాన్ని రవితేజ దక్కించుకున్నాడు.

అయితే తాను నటించిన లాస్ట్ చిత్రం డిస్కో రాజా ఫైల్యూర్ తో తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పవర్ ఫుల్ కాప్ గా “క్రాక్” అనే చిత్రంతో రెడీ అయ్యారు. ఇప్పటికే ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం పై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి.

అయితే ఈ ఏడాది నెలకొన్న పరిస్థితులు మూలాన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలపాలని మేకర్స్ ఫిక్సయ్యారు. అయితే ముందు అదే రేస్ లో ఇంకా చాలా మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ప్లాన్ చేశారు. కానీ కరోనా ప్రభావం అలాగే థియేటర్స్ లో సీట్ల పరిమితి విషయంలో ఆలోచించి తప్పుకుంటున్నారని టాక్ మొదలయ్యింది.

కానీ క్రాక్ మాత్రం అప్పటికే ఫిక్స్ అని ఇంకా వినిపిస్తుంది. మరి ఆ సమయంలో మాస్ మహారాజ్ సోలోగా రిస్క్ తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు ఎలాగో కొత్త సినిమా సందడి కూడా మొదలయ్యింది. మరి ఏదన్నా సరే థియేటర్స్ కు వచ్చే జనాన్ని బట్టే ఏదన్నా ఆధారపడి ఉంది.

సంబంధిత సమాచారం :

More