ఎన్టీఆర్ లేకుండా ఆ బయోపిక్ వర్క్ అవుట్ అవుతుందా?

Published on Apr 2, 2020 12:29 pm IST

తమిళ ప్రజల ఆరాధ్య దైవం దివంగత సీఎం, హీరోయిన్ అయిన జయలలిత బయోపిక్ తలైవి పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తుండగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ భారీ క్యాస్టింగ్ తో తెరక్కుతుంది. కాగా జయలలిత సినీ కెరీర్ లో కీలక పాత్ర పోషించిన హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. కాగా ఆయన పాత్ర కోసం బాలయ్య, ఎన్టీఆర్ లను సంప్రదించగా తిరస్కరించారని తెలుస్తుంది.

దీనితో ఎన్టీఆర్ పాత్రను సినిమాలో తీసేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఇదే కనుక నిజం అయితే ఎన్టీఆర్ లేకుండా జయలలిత బయోపిక్ తెలుగులో వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానం కలుగుతుంది. తమిళ హిందీ భాషలలో ఎన్టీఆర్ లేకున్నా హర్షింసించే ప్రేక్షకులు, తెలుగులో ఎన్టీఆర్ లేకుండా జయలలిత జీవిత కథను సంపూర్ణంగా ఫీల్ కాకపోవచ్చు. చూడాలి మరి దర్శకుడు ఏ ఎల్ విజయ్ ఏమి చేస్తాడో.

సంబంధిత సమాచారం :

X
More