‘తెనాలి రామకృష్ణ’ సందీప్ కి హిట్ ఇస్తాడా ?

Published on Nov 14, 2019 11:00 pm IST

జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రేపు విడుదల కాబోతున్న కామెడీ ఎంటర్ టైనర్ ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. కాగా ఈ సినిమా ‘U/A ‘ సర్టిఫైతో 2 గంటల 8 నిముషాలు పాటు ఫుల్ ఫన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బాగా నవ్వించడానికి సన్నధం అవుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఏ స్థాయిలో నవ్విస్తోందో చూడాలి. చాల సినిమాల తర్వాత ఎట్టకేలకూ ‘నిన్ను వీడని నీడను నేనే’తో హిట్ అందుకున్న సందీప్ కిషన్.. ‘తెనాలి రామకృష్ణ’తో కూడా మరో సాలిడ్ హిట్ అనుకుంటాననే ధీమాతో ఉన్నాడు. మరి ‘తెనాలి రామకృష్ణ’ సందీప్ కి హిట్ ఇస్తాడా ? ఎలాగూ మరో మూడు నాలుగు గంటల్లో స్పెషల్ షోలు మొదలవ్వబోతున్నాయి కాబట్టి సినిమా టాక్ బయటకు వచ్చేస్తోంది.

కాగా ఈ సినిమా క్లైమాక్స్ చాల బాగా వచ్చిందట. ముఖ్యంగా సందీప్ కిషన్ విలన్స్ పై తన వ్యూహాలను ఉపయోగించే విధానం, అలాగే క్లైమాక్స్ లో ప్రధానంగా వచ్చే స్కూటర్ ఎపిసోడ్‌ బాగా నవ్విస్తాయని తెలుస్తోంది. హ‌న్సిక కథానాయకిగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా అగ్రహారం నాగి రెడ్డి, సంజీవరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More