
మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో రవితేజ పాత్రను, మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో రవితేజ పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ ను మెగాస్టార్ చెప్పబోతున్నాడని టాక్. పైగా మెగాస్టార్ వాయిస్ ఓవర్ సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ డీల్స్ కూడా పూర్తి అయ్యాయి. జీ గ్రూప్ భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. జీ 5 ఈ చిత్రాన్ని ప్రసారం చేయనుంది. జీ తెలుగు మరియు జీ సినిమా ఈ సినిమాని ప్రసారం చేయనుంది. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

