ఎన్టీఆర్ సినిమా టైటిల్ మారాబోతుందా ?

Published on Jul 11, 2020 9:59 pm IST


‘అయినను పోయి రావలె హస్తినకు’.. అనే టైటిల్ తో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని.. ఇదే టైటిల్ ను ఖాయం చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి మరో టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తుండటంతో.. టైటిల్ అన్ని భాషల్లో ఈజీగా రీచ్ అవ్వాలంటే.. అచ్చ తెలుగు టైటిల్ కాకుండా.. ఏ ఆర్ఆర్ఆర్ లాగానో అన్ని భాషల వాళ్లకు అర్ధం అయ్యేలా ఒకే టైటిల్ పెడితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారట.

ఇక ఈ సినిమాలో భిన్నమైన రాజకీయ నేపథ్యం ఉంటుంది అట. అయితే రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More