బిగ్ బాస్ షో కి మరో ఇద్దరు హాట్ బ్యూటీస్?

Published on Jul 31, 2019 12:54 pm IST

మొదటివారం విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ షో ఘనంగా రెండవవారంలోకి కూడా ప్రవేశించింది. ఈ రియాలిటీ షోకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణతో దూసుకుపోతుంది. ఈ షోకి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ ఇందుకు ఉదాహరణ. కాగా మొదటివారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఆరుగురు ఇంటిసభ్యుల నుండి నటి హేమ ఎలిమినేట్ చేయబడ్డారు. వెంటనే ఈమె స్థానంలో ఆసక్తికరంగా ట్రాన్స్ జెండర్ తమన్నా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశింపజేశారు.

ఐతే బిగ్ బాస్ షోలోకి మరో ఇద్దరు టాలీవుడ్ బ్యూటీస్ ప్రవేశించనున్నారని టాక్. షో కి పెరుగుతున్న ఆదరణ రీత్యా మరింత గ్లామర్ యాడ్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఆ ఇద్దరిలో ఒకరు శ్రద్దా దాస్ అయ్యే అవకాశం కలదు. మరొకరు ఎవరు అనేది తెలియాల్సివుంది. ఇప్పటికే రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ 3 రియాలిటీ షో ఇలాంటి క్రేజీ న్యూస్ తో మరింత ఫేవరెట్ గా మారుతుంది.

రెండవ వారం ఎలిమినేషన్స్ కి గాను ఎనిమిది మంది ఇంటి సభ్యులు నామినేట్ కాగా వారిలో వరుణ్, వితిక కపుల్ తో పాటు,యాంకర్ శ్రీముఖి ఉండటం గమనార్హం. వీరితో పాటు, జాఫ్ఫర్, పునర్నవి, మహేష్, హిమజ, రాహుల్ ఉన్నారు. మరి ఈ వారం ఎవరు హౌస్ కి గుడ్ బాయ్ చెప్పనున్నారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :