యష్ మహేష్ ని బీట్ చేస్తాడా?

Published on Jul 4, 2020 3:07 pm IST

ఏడాదిన్న క్రితం విడుదలైన కెజిఎఫ్ టెలివిజన్ ప్రీమియర్ కి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. జులై 5న అంటే రేపు ఆదివారం ఈ మూవీ స్టార్ మాలో సాయంత్రం 5:30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఏకంగా హీరో యష్ రంగంలోకి దిగి ఈకెజిఎఫ్ చూడండి అని ప్రచారం కల్పించారు. ఈ నేపథ్యంలో కెజిఎఫ్ తెలుగులో ఎంత టి ఆర్ పి దక్కించుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఐతే కెజిఎఫ్ రికార్డు టి ఆర్ పి దక్కించుకోవడం ఖాయమని తెలుస్తుండగా.. ఏ స్థాయి రేటింగ్ అనేది చూడాలి.

ఇక టాలీవుడ్ లో హైయెస్ట్ టి ఆర్ పి దక్కించుకున్న సినిమాగా సరిలేరు నీకెవ్వరు ఉంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు 23.04 టి ఆర్ పి దక్కించుకొని టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తరువాత 22.7 తో బాహుబలి 2 ఉంది. మరి రేపు ప్రసారం అయ్యే కెజిఎఫ్ తో యష్ టాప్ టి ఆర్ పి దక్కించుకొని మహేష్ ని క్రాస్ చేస్తాడో లేదో చూడాలి. ఎంత హైప్ ఉన్నప్పటికీ సరిలేరు నీకెవ్వరు మూవీ టి ఆర్ పి ని దాటివేయడం అంత సులభం కాదు.

సంబంధిత సమాచారం :

More