ఫ్యాన్స్ తో ఫోటో దిగుతాను అంటున్న సమంత.

Published on Jan 17, 2020 8:21 am IST

టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని అభిమానులకు తనతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తున్నారు. ఓ చిన్న ఫోటో పంపించి ఆ అవకాశం దక్కించుకోమని అంటున్నారు. విషయంలోకి వెళితే సమంత, శర్వానంద్ జంటగా జాను అనే చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా యూనిట్ ఓ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. వరల్డ్ అందమైన నేచర్ ని తమ కెమెరాలో బంధించి ‘మై క్లిక్ ఫర్ జాను'(#MyClickForJaanu) అనే యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ పోస్ట్ చేయాలట. అలా పంపినవారిలో ఎంపికైన వారితో హీరోయిన్ సమంత మరియు శర్వానంద్ కలిపి ఫోటో దిగుతారట.

సమంతాను కలవాలి ఆమెతో ఫోటో దిగాలని కోరిక ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ తమ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి ఓ అందమైన ఫోటో తీసి పంపండి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో జాను చిత్ర యూనిట్ ఇలా వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ మూవీ 96 కి తెలుగు రీమేక్ గా జాను చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More