9 కథలు 9 ఎమోషన్స్ తో కోలీవుడ్ అంతా ఒక్కటైన వేళ.!

Published on Oct 28, 2020 11:03 am IST

మన దక్షిణనాదిలో వినూత్న సినిమాలను తెరకెక్కించడంలో కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎప్పుడూ ముందుటుంది. అలా ఈసారి ఒక ఊహించని సరికొత్త అడుగు కోలీవుడ్ వేసింది. కోలీవుడ్ కు చెందిన టాప్ మోస్ట్ నటులు అలాగే టాలెంటెడ్ దర్శకులు సంగీత దర్శకులు అలాగే రచయితలు కలిసి 9 రకాల ఎమోషన్స్ తో 9 రకాల కథలతో తమిళ ఇండస్ట్రీ అంతా తమ ప్రేక్షకుల కోసం కలిసి పని చెయ్యడం గమనార్హం.

ఇది సినిమానా లేక డాక్యుమెంటరీ లాంటిదా అన్నది క్లారిటీ లేదు కానీ నెట్ ఫ్లిక్స్ లో”నవరస” గా అతి తొందరలోనే విడుదల చెయ్యనున్నట్టుగా తెలుపుతున్నారు. అయితే దీనికి గౌతమ్ మీనన్, కేవీ ఆనంద్, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, అరవింద స్వామి, హలిత షమీమ్, పొన్రమ్, కార్తీక్ నవీన్, రతిందరన్ ఆర్ ప్రసాద్ లు ఇలా 9 మంది దర్శకులు. అలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహామన్, డి ఇమన్, జిబ్రాన్, అరుళ్ దేవ్, కార్తీక్, గోవింద్ వసిష్ఠ అలాగే “రాధే శ్యామ్” మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్, ఏతన్ యుహన్ ఇలా 9 మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు.

అలాగే కోలీవుడ్ స్టార్ నటులు సూర్య, అరవింద స్వామి, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, శర్వాణన్, పెరుమాళ్, విక్రాంత్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, రోబో శంకర్, ఇంకా కొంత మంది మెల్ లీడ్స్ లో నటిస్తుండగా రేవతి, నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్, పూర్ణ, రిత్విక అలాగే పార్వతిలు ఫిమేల్ లీడ్స్ లో నటిస్తుండగా లెజెండరీ దర్శకులు మణిరత్నం మరియు జయేంద్ర పంచపకేసన్ లు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More