స్పెషల్ క్యాస్టింగ్ తో ఆసక్తిగా మారుతున్న శర్వానంద్ సినిమా.!

Published on Aug 3, 2021 3:38 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ చేస్తున్న పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అలాగే మరికొన్ని చిత్రాలు చిత్రీకరణ స్టేజ్ లో ఉన్నాయి. మరి వాటిలో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే చిత్రం కూడా ఒకటి. స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం గత వారమే కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేసుకుంది.

అయితే మంచి హంగులతో ఈ చిత్రంలో మరింత మంది స్టార్ క్యాస్టింగ్ కూడా యాడ్ అయ్యినట్టు తెలుస్తుంది. నటి ఖుష్బూ, అలాగే రాధికా శరత్ కుమార్ మరియు ఊర్వశి లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఈ చిత్రం మరింత ఇంట్రస్టింగ్ గా మారిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :