‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ టీజర్ రిలీజ్ కి టైం ఫిక్స్ !

Published on Jan 3, 2020 1:11 am IST

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా రాబోతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కాగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రేపు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజున ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం రాశీఖ‌న్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

కాగా విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. మొత్తానికి టైటిల్ బాగా క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :