‘వరల్డ్ ఫేమస్ లవర్’ నైజాం కలెక్షన్స్ !

Published on Feb 15, 2020 4:51 pm IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా నిన్న విడుదలై మిశ్రమ స్పందనను సాధించింది.

అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నైజాం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. రూ. 2.02 కోట్లు ను రాబట్టింది ఈ చిత్రం. విజయ్ కి నైజాంలో అభిమానుల ఫాలోయింగ్ ఎక్కుక ఉంది. అందుకే కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి. కాగా వచ్చే వారం కూడా ఈ సినిమా రన్ స్టడీగానే కొనసాగితే పంపిణీదారులు లాభాల్ని ఆర్జించే అవకాశం ఉంది.

ఇక సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్‌ అండ్ విజయ్ – రాశిల మధ్య కెమిస్ట్రీ అలాగే కొన్ని లవ్ ఎపిసోడ్లు బాగున్నాయి అంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More