‘వరల్డ్ ఫేమస్ లవర్’ నైజాం సెకెండ్ డే కలెక్షన్స్ !

Published on Feb 16, 2020 10:43 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్. ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా 14వ తేదీన విడుదలైంది. కాగా సినిమాలో ప్రధాన నటీనటుల నటనకు ప్రశంసనీయమైన అభినందనలు వచ్చిన్నప్పటికీ, ఈ చిత్రానికి విమర్శకులు, సినీ ప్రేమికుల నుండి మాత్రం మిశ్రమ స్పందన మాత్రమే లభిచింది.

అయితే విజయ్ దేవరకొండ క్రేజీతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ నమోదు అయ్యాయి. ఈ చిత్రం నైజాంలో మొదటి రోజు రూ .2.02 కోట్లను అలాగే శనివారం నాడు రూ .84.36 లక్షలను వసూళ్లు చేసింది. ఇక ఎలాగూ ఈ రోజు సండే కాబట్టి వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

కాగా రేపటి నుండి ఉండబోయే వసూళ్ళతో సినిమా ఫలితమేమిటన్నది తేలిపోతుంది. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ నిర్మించగా ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్ థ్రెస, ఇసబెల్లా కథానాయికలుగా నటించారు.

సంబంధిత సమాచారం :

X
More