వరల్డ్ బిగ్గెస్ట్ హిట్ సిరీస్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.!

Published on Jul 27, 2021 8:02 am IST


ఈ కరోనా ప్యాండమిక్ మూలాన ఏమో కానీ ఓటిటి సంస్థల వారికి జరిగినంత మేలు ఇంకెవరికీ జరగలేదు అనే చెప్పాలి. గత లాక్ డౌన్ మూలానే ఓటిటి కంటెంట్ చాలా మేర ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు చేరింది. దీనితో అలా చాలా మందికి చాలా విషయాలే తెలిసాయి. మరి ఎంతో పాపులర్ అయ్యినటువంటి వెబ్ సిరీస్ ల కోసం కూడా తెలుసుకున్నారు.

మరి వాటన్నిటిలో కూడా బిగ్గెస్ట్ హిట్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే స్పానిష్ సిరీస్ “లకాసా డి పాపెల్” ఇంగ్లీష్ లో “మనీ హేస్ట్” అనే అంటారు అంటారు. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అండ్ భారీ వ్యూస్ అందుకున్న సిరీస్ ఇదే.. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు రాగా ఐదవ సీజన్ కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇది కూడా రెండు పార్టులుగా విడుదల కానుండగా వాటిలో మొదటి పార్ట్ ట్రైలర్ లాంచ్ కి డేట్ ఫిక్స్ అయ్యిపోయింది. దానిని ఈ హిట్ సిరీస్ లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ రోల్ చేసిన అల్వరో మోర్తే తెలిపాడు. వచ్చే ఆగష్టు 2న ఈ బిగ్గెస్ట్ హెహిట్ సిరీస్ ట్రైలర్ వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఈ సిరీస్ అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :