‘శ్యామ్ సింగ రాయ్’ షూట్ ముగించాడు !

Published on Jul 26, 2021 12:40 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ నేటితో ముగిసింది. ఈ విషయాన్ని చిత్రబృందం నాని మేకప్ షూట్ ఫోటోను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. మేకర్స్ రిలీజ్ చేసిన స్టిల్ లో నాని మీస కట్టుతో అద్దంలో గంభీరమైన లుక్స్ లో తీవ్రమైన తీక్షణపు చూపులతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.

కాగా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఎక్కువ భాగం నడుస్తోందని.. ముఖ్యంగా నాని రోల్ కి సంబంధించిన కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాల బాగుంటాయని… అందుకే నాని ఈ సినిమా పై బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి నాని 27వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రానికి కథ: సత్యదేవ్‌ జంగా, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందట.

సంబంధిత సమాచారం :