దర్శకుడి గా మారబోతున్న RX100 సినిమా మాటల రచయిత సయ్యద్

Published on Aug 15, 2021 4:52 pm IST

RX100 ఈ సినిమా 2018లో ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ అనేక యూట్యూబ్ చానల్స్ లో, మీమ్ పేజెస్ లో, యువతరం కుర్రాళ్ళ ఫోన్లలో మారు మోగుతుంటాయి. అజయ్ భూపతి కథ రచయితగా స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మాటల రచయిత సయ్యద్.

ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో మాటల రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సయ్యద్ ఆ తర్వాత ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన కల్కి మరియు జాంబిరెడ్డి చిత్రాలకు కూడా మాటల రచయితగా తన సత్తా చాటుకున్నారు సయ్యద్. ఆ తర్వాత రానున్న ఇంకొన్ని చిత్రాలకు కూడా మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం మహా సముద్రం. శర్వానంద్, సిద్దార్థ ల హీరోలుగా నటించిన ఈ సినిమా ఇప్పటికే మోషన్ పోస్టర్లతో హల్ చల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సంచలన దర్శకుడు అజయ్ భూపతి, డైలాగ్ రైటర్ సయ్యద్ కాంబినేషన్ లో ఆర్‌ఎక్స్ 100 లాంటి మరో గొప్ప సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదే కాకుండా శ్రీహాన్ క్రియెషన్స్ లో ఒక వెబ్ ఫిల్మ్, మరియు సురేశ్ ప్రొడక్షన్, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మరో చిత్రానికి కూడా సయ్యద్ మాటలు అందించారు. దీనికి డెబ్యు డైరెక్టర్ సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తుండగా, సింహా కోడూరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తన ప్రతిభతో మంచి మంచి అవకాశాలతో రాణిస్తున్న రచయిత సయ్యద్ ఇప్పుడు ఒక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు కథ చెప్పటం, వారికి నచ్చటంతో ఈ అవకాశం వచ్చింది. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో సయ్యద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :