ఒక్క పాటకి 2 కోట్లు ఖర్చు పెట్టాడట.!

ఒక్క పాటకి 2 కోట్లు ఖర్చు పెట్టాడట.!

Published on Mar 24, 2015 3:36 PM IST

Rey
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా రెండవ సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకనిర్మాత అయిన వైవిఎస్ చౌదరి మెగా ఫ్యామిలీ హీరో అయిన సాయి ధరమ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘రేయ్’. పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమాని మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయాన్నీ తెలియజేస్తున్నాం. ఈ సినిమా చివర్లో సుమారు 8-10 నిమిషాల పాటు సాగే పాట ఒకటి ఉంటుంది.

ఈ పాట కోసం లాస్ ఏంజల్స్ లోని స్టేబుల్ సెంటర్ అనే స్టేడియం ని లొకేషన్ గా అనుకున్నాం. ఆ పాటలో తెడియం లా అనిపించే సెట్, పాప్ స్టార్స్ లుక్స్ ని తలపించే కాస్ట్యూమ్స్, మిగతా అంతా కలుపుకొని ఆ ఒక్క పాట కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం అని ఈ చిత్ర డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెలిపాడు. ఈ పాటని 35 రోజులు కంటిన్యూగా షూట్ చేసారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ కి స్టెప్స్ కంపోజ్ చేసాడు.

సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఓ డాన్సర్ లా కనిపిస్తాడు. సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాని ఎక్కువ భాగం కరేబియన్ దీవులు, కాలిఫోర్నియాలో షూట్ చేసారు. స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు