ఈసారి తారక్ బర్త్ డే కి ‘యమ దొంగ’ ట్రీట్..!

ఈసారి తారక్ బర్త్ డే కి ‘యమ దొంగ’ ట్రీట్..!

Published on Apr 17, 2025 7:10 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేసిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో తమ మొదటి ఫాంటసీ వండర్ చిత్రం “యమ దొంగ” కూడా ఒకటి. నిజానికి జక్కన్న నుంచి విజువల్ ఎఫెక్ట్స్ తో మగధీర సినిమా కంటే ముందే రాజమౌళి యమ దొంగ చిత్రంతో సత్తా చాటారు. ఇక ఇందులో మోహన్ బాబు సాలిడ్ పాత్రలో నటించగా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం.

మరి ఇపుడు ఫైనల్ గా తన బర్త్ డే కానుకగా యమ దొంగ సిద్ధం అవుతున్నాడు. మరి రానున్న ఈ మే 18న సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఇపుడు సిద్ధం అయ్యింది. మే 20న తారక్ పుట్టినరోజు కాగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. అది కూడా ప్రింట్ 4కే లో రీ మాస్టర్ చేయడం జరిగింది. మరి ఈ సినిమాకి న్యూట్రల్స్ లో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ చిత్రం ఎలా అలరిస్తుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు