“కేజీయఫ్ 2” కోసం ఫైనల్ వర్క్ స్టార్ట్ చేసిన యష్.!

Published on Jun 23, 2021 3:02 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా బిజీగా ఉంది.

అయితే మరి ఇప్పుడు రాకింగ్ స్టార్ యష్ తన ఫైనల్ వర్క్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదే ఈ సినిమా డబ్బింగ్ ను యష్ స్టార్ట్ చేసేసి ముగించే పనిలో ఉన్నాడట. ఇప్పటికే ఈ చిత్రంలో మరో కీలక నటి మాళవిక కూడా తన డబ్బింగ్ ను కొన్ని రోజులు కితమే స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసారు.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ కూడా కొన్ని రోజుల్లో అనౌన్స్ కానుంది అని కూడా టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :