యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ !

Published on Jan 27, 2019 10:58 am IST

మచ్ అవైటెడ్ బయోపిక్ యాత్ర విడుదలకు సిద్దమవుతుంది. మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫై టాలీవుడ్లో మంచి అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 1న మాధాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హల్ లో జరుగనుంది. అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఎవరు వస్తారనే విషయం ఫై ఇంకా క్లారిటీ రాలేదు.

లెజండరీ పొలిటీషియన్ ,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. జగపతి బాబు , అనసూయ , సుహాసిని , ఆశ్రిత ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :