వైఎస్సార్ ‘యాత్ర’ గురించి ఆసక్తికరమైన వార్త !
Published on Oct 10, 2018 6:01 pm IST

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. కాగా వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రను జగపతిబాబు పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రాజారెడ్డిగారికి సంబంధించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ అవుతాయట. ఎప్పుడు ధైర్యంగా గాంభీరంగా ఉండే ఆయన్ని.. ఈ చిత్రంలో కూడా అలాగే చూపిస్తున్నారు.

ఇక ఆయన పాత్రలో కనిపిస్తోన్న జగపతిబాబు కెరీర్ లో మరో గుర్తు పెట్టుకున్నే పాత్ర అవుతుందని అంటున్నారు. ఇక ఈ యాత్ర చిత్రంలో సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

  • 2
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook