యాత్ర సీక్వెల్ కోసం బాలీవుడ్ నటుడు?

Published on Jul 2, 2021 6:27 pm IST

తెలుగు సినిమా పరిశ్రమ లో బయోపిక్ లు వస్తూనే ఉన్నాయి. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ యాత్ర కి సీక్వెల్ ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఈ యాత్ర చిత్రాన్ని మమ్ముట్టి తో తీసిన దర్శకులు ఇప్పుడు యాత్ర సీక్వెల్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత అంశాన్ని చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్రం కోసం ఇప్పటికే బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ ను సంప్రదించినట్లు సమాచారం. కథ విన్న ప్రతీక్ గాంధీ కథ పై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్కాం 1992 తో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ నటుడు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర కానున్నారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి తన తండ్రిని అనుసరిస్తూ ముఖ్యమంత్రి వరకూ ఎలా ఎదిగారు అనేది ఈ సినిమా అన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీని పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :