
తమిళనాట అజిత్ నటించి ఘన విజయం సాధించిన ‘ఎన్నై అరిందాల్’ సినిమా తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతొ అనువాదం జరుపుకుంది. ఈ సినిమా తమిళనాట విడుదలై మంచి రివ్యూలను అందుకుంది. గౌతం మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఏ.ఎం రత్నం నిర్మాత. ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ఈ నెల 22న మనముందుకురానుంది.
ఈ సినిమాలో త్రిష, అనుష్క హీరోయిన్స్ గా నటించారు. వివేక్ మరియు అర్జున్ విజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు వెర్షన్ యొక్క ఆడియో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ లను క్రిందటి నెలలోనే విడుదలచేసారు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం వున్న పేర్లు కావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి.

