త్రివిక్రమ్ పవన్ ని కలవడం వెనుక ఆంతర్యం ఏమిటో?

Published on Jan 2, 2020 7:23 am IST

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివికమ్ అలాగే పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా సూపర్ హిట్ కాగా.. అత్తారింటికి దారేది చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అజ్ఞాతవాసి మాత్రం పరాజయం పాలైంది. పవన్ కొద్ది రోజులలో రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయవాడలో త్రివిక్రమ్, పవన్ ని కలవడం ఆసక్తి కరంగా మారింది.

త్రివిక్రమ్ పవన్ మిత్ర ధర్మంగా కలిశారా లేక వీరి మధ్య నూతన చిత్రానికి సంబంధించిన చర్చలు ఏమైనా జరిగాయా అనే అనుమానాలు రేగుతున్నాయి. ప్రస్తుతం పవన్ నటించనున్న పింక్ రిమేక్ అలాగే దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్న పీరియాడిక్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. ఇంకొద్ది రోజులలో ఈ మూవీస్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కానీ సినిమా ఉంటే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :