నాని సినిమా కోసం పోటీ పడుతున్న బాలీవుడ్

నాని సినిమా కోసం పోటీ పడుతున్న బాలీవుడ్

Published on Mar 25, 2015 10:45 AM IST

Yevade-Subramanyam
దాదాపు ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా ఉగాది కానుకగా రిలీజ్ అయిన్ డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అటు విమర్శకులను, ఇటు మల్టీ ప్లెక్స్, ఏ సెంటర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంటున్న ఈ సినిమాని స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మించింది. నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా పరిచయం అయిన ఈ సినిమాలో రీతు వర్మ, మాళవిక నాయర్, విజయ్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఒక మల్టీ మిలినియర్ కంపెనీకి ఓనర్ కాబోతున్న యంగ్ బాయ్ సడన్ గా అన్నీ వదిలి హిమాలయలోని దూద్ కాశికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేదే ఈ సినిమా కథ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలని అప్రోచ్ అయ్యారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. ఇలాంటి ఓ కాన్సెప్ట్ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చే అవకాశం ఉంది. అందుకే అక్కడి నిర్మాతలు సినిమా రైట్స్ కోసం పోటీ పడుతున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు